“రాధే శ్యామ్” రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు!

Published on Jan 3, 2022 11:40 am IST


పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం రిలీజ్ డేట్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్ట్ పొన్ అవ్వడం తో చిన్న సినిమాలు తమ సత్తా చాటేందుకు సిద్దం కాగా, రాధే శ్యామ్ మరియు బంగార్రాజు సినిమాలు అనుకున్న విధంగా విడుదల చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది.

సంబంధిత సమాచారం :