మెగా బ్రదర్స్ కు యాదృచ్చికంగా కలిసిన అంశం.!

Published on Aug 21, 2020 11:21 am IST

మన టాలీవుడ్ లో మెగా బ్రదర్స్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల నడుమ ఉన్న బంధం ఎంత గట్టిదో ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమానురాగాలు కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే మెగా ఫ్యాన్స్ కు వచ్చే ఆనందమే వేరు.

అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ పుట్టినరోజు సందర్భంగా వారు నటిస్తున్న సినిమాలకు చెందిన ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ రావడం ఒక స్పెషల్ అయితే మరో అంశం ఈ ఏడాది వీరిద్దరి అన్నాతమ్ములకు యాదృచ్చికంగా కలిపింది అన్ని చెప్పాలి.

గత ఏడాది చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 న వినాయక చతుర్థి రాగా ఈ ఏడాది మాత్రం అన్నయ్య మెగాస్టార్ చిరు పుట్టిన రోజు ఆగష్టు 22 న వినాయక చతుర్థి వచ్చింది. ఈ అంశం ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ కు భలే యాదృచ్చికంగా వచ్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :