హీరోగా మరో సినిమా చేయనున్న స్టార్ కమెడియన్ !


కమెడియన్ గా ఆనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించి స్టార్ కమెడియన్ గా ఎదిగిన సప్తగిరి కెరీర్లో ఇంకాస్త ముందుకెళ్లాలన్న ఆలోచనతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా మొదటి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చేసి ప్రేక్షకుల చేత పర్వాలేదనిపించుకున్న ఆయన ప్రస్తుతం సోలో హీరోగా మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘జాలీ ఎల్.ఎల్.బి’ ఆధారంగా చేసుకుని రూపొందనుంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని డా. రవి కుమార్ నిర్మిస్తుండగా చరణ్ లక్కాకుల డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజే లాంచ్ అయిన ఈ సినిమాకి ‘సప్తగిరి ఎల్.ఎల్ .బి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, షూటింగ్ మొదలయ్యే తేదీ వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.