మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అభిమానులు సినీ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు అంతా తన సైడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్ ల అప్డేట్ లు కూడా రాగా ఇవి ఫ్యాన్స్ లో మరింత నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
అయితే ఫ్యాన్స్ అన్నాక ఏ హీరోకి అయినా తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలా విజయ్ దేవరకొండ అభిమానులు కూడా క్రేజీ లెవెల్లో తన పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఆఫ్ లైన్ లో రచ్చ లేపేశారు. అలా వారి విజువల్స్ వైరల్ అవుతుండగా వారు విజయ్ దేవరకొండ తమ్ముడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో కేక్ కట్ చేయించారు.
మరి అక్కడ అందుబాటులో లేని విజయ్ కి ఆనంద్ వీడియో కాల్ చేసి తన అభిమానులకి ఇవ్వగా ఫ్యాన్స్ తో విజయ్ ముచ్చటించి తనకి ఈ రేంజ్ సెలబ్రేషన్స్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తమ అభిమాన హీరోతో వీడియో కాల్ మాట్లాడ్డంతో వారి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. దీనితో సినీ వర్గాల్లో ఈ వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి.
.@TheDeverakonda 's fans in full-blown josh mode as they celebrate their beloved star's birthday.
VD reciprocates by greeting them through a video call.
Heartening to watch the camaraderie between the hero and his fans. #VijayDeverakonda #HBDTHEVijayDeveakonda pic.twitter.com/HdHZwZeYF5
— BA Raju's Team (@baraju_SuperHit) May 9, 2024