మన తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఇటీవల కేంద్ర ప్రభుతం కళారంగంలో చిరు చేసిన సేవలకు గాను భారతీయ రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరుదైన ఘనత చిరు అందుకోవడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అంతే కాకుండా తెలంగాణా ప్రభుత్వం చిరు కి సన్మానం కూడా నిర్వహించి సత్కరించారు. అయితే పద్మ పురస్కారాలని గౌరవప్రదంగా దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో ఆయా రంగాల్లో రాణించిన వారికి రాష్ట్రపతి భవన్ లో అందిస్తారని తెలిసిందే. అలా ఈరాజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి గాను చిరు తన కుటంబంతో కలిసి వెళ్లారు.
మరి ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదగా మెగాస్టార్ తన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న విజువల్స్ జాతీయ మీడియా ద్వారా బయటకి వచ్చాయి. మరి దీనితో ఈ వీడియో ఇప్పుడు అభిమానుల్లో సినీ ప్రముఖుల్లో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు.
Telugu films Mega Star Konidela Chiranjeevi (@KChiruTweets) recieves #PadmaVibhushan from President #DroupadiMurmu
With an illustrious career spanning 4 decades, he has worked in over 150 films across 5 languages and also served the country as Former Union Minister… pic.twitter.com/W057cTeCcO
— PIB India (@PIB_India) May 9, 2024