వారసుడు విడుదల హిందీలో కూడా… కానీ ఎప్పుడు ?

వారసుడు విడుదల హిందీలో కూడా… కానీ ఎప్పుడు ?

Published on Nov 28, 2022 10:00 AM IST

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వారిసు’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తన నిర్మాణంలో వస్తున్న ‘వారిసు’ సినిమాను తెలుగులోకి ‘వారసుడు’గా దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఐతే, దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తమిళం మరియు తెలుగుతో పాటు హిందీలో కూడా షూట్ చేస్తున్నాం అని, అలాగే మూడు భాషల్లోనూ విడుదల చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చారు.

ఐతే, ఇప్పటివరకు, మేకర్స్ హిందీలో ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. అందుకే, వారసుడు హిందీ వెర్షన్ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తుందా ? లేదా ? అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మరోపక్క ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాల సరసన వారసుడు రిలీజ్ అయి ఏ స్థాయి విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు