టాక్.. రజినీ “జైలర్” నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోందా..?

Published on Jul 24, 2022 7:06 am IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం అక్కడి స్టార్ దర్శకుడు బీస్ట్, డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమాకి మాస్ టైటిల్ “జైలర్” అని ఫిక్స్ చేశాక మరిన్ని అంచనాలు పెంచుకుంటూ వచ్చింది.

మరి అలాగే భారీ సెట్స్ లో కూడా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ క్రేజీ అప్డేట్ ఒకటి వినిపిస్తోంది. మేకర్స్ అతి త్వరలోనే ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియో ని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. మరి ఈ క్రేజీ బజ్ పై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :