పవర్ – బాలయ్య ఎపిసోడ్ నుంచి క్రేజీ అప్డేట్.!

పవర్ – బాలయ్య ఎపిసోడ్ నుంచి క్రేజీ అప్డేట్.!

Published on Jan 14, 2023 8:01 AM IST

మన తెలుగు లో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ ఓటిటి యాప్ ఆహా కోసం అందరికి తెలిసిందే. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా చేసిన అన్ స్టాప్పబుల్ అయితే క్రేజీ హిట్ అయ్యి ఇప్పుడు అయితే రెండో సీజన్లో మరింత పెద్ద హిట్ అయ్యి అంతకు మించిన గెస్టులతో అదిరిపోయింది. దీనితో ఈసారి ఒకో ఎపిసోడ్ ఒకో రేంజ్ హైప్ నెలకొనగా ఇక రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ మాసివ్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది.

ఇక దీని తర్వాత ఇంకో బిగ్గెస్ట్ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేయగా దీనిపై కూడా భారీ హైప్ సెట్ అయ్యింది. ఇక దీనిపై లేటెస్ట్ గా ఆహా వారు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇద్దరి పై ఈ ఎపిసోడ్ కి ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ వీడియో డిజైన్ చేసి ఈ ఎపిసోడ్ అయితే ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ అనౌన్స్ చేశారు. దీనితో ఈ క్రేజీ ఎపిసోడ్ పై పవన్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు