లేటెస్ట్..”గాడ్ ఫాథర్” మాసివ్ ప్రీ రిలీజ్ కి డేట్, వేదిక ఫిక్స్.!

Published on Sep 25, 2022 2:00 pm IST

టాలీవుడ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మరో సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన అవైటెడ్ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ గ్యాప్ లో మెగాస్టార్ సహా ఇతర చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని కూడా ఓ రేంజ్ లో స్టార్ట్ చెయ్యగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పుడు అధికారిక అప్డేట్ బయటకి వచ్చేసింది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సెప్టెంబర్ 28న లాక్ చెయ్యగా అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి జరపనున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఓ క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. ఇక ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :