అఫీషియల్ : “ఆదిపురుష్” సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్.!

Published on May 27, 2023 8:04 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా పీరియాడిక్ వండర్ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా కొద్ది సమయమే ఉండగా మేకర్స్ ఇప్పుడు పలు అప్డేట్స్ ని అయితే అందిస్తూ వస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ హిట్ కాగా గత కొన్ని రోజులు నుంచి వినిపిస్తున్న సెకండ్ సింగిల్ పై అయితే మేకర్స్ ఇప్పుడు సైలెంట్ గా అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసారు. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రామ్ సియా రామ్’ ని అయితే ఈ మే 29న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఈ సాంగ్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కాకపోతే ఎలాంటి అలర్ట్స్ లేకుండా అనౌన్స్ చేయడం కాస్త ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి. ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అవుట్ పుట్ వచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ 29న వచ్చే సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :