మహేష్, ఎన్టీఆర్ ల మాసివ్ బ్లాస్టర్ కి డేట్ ఫిక్స్..?

Published on Oct 24, 2021 4:01 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని డ్రీం కాంబోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబో కూడా ఒకటి. ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందని ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే ఇంకా సిల్వర్ స్క్రీన్ వరకు ఈ ఇద్దరి కాంబో వెళ్ళలేదు కానీ స్మాల్ స్క్రీన్ పైకి మాత్రం ఈ కాంబో హంగామా చేసేందుకు రెడీ అయ్యింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్న మరో గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” కి స్పెషల్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా హాట్ సీట్ లో కూర్చుకునేందుకు మహేష్ రెడీ అయ్యారు. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ షూట్ కూడా కంప్లీట్ అయ్యింది.

ఇక మరి ఈ బిగ్గెస్ట్ బ్లాస్టర్ ఎపిసోడ్ ని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు అనేది ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ కి ప్లాన్ చేసినట్టు ఇప్పుడు సమాచారం. మరి ఆల్రెడీ ఈ కాంబోతో భారీ టీఆర్పీ రావడం ఖాయం అని అందరికీ అర్ధం అయ్యింది ఇక టెలికాస్ట్ ఒక్కటే తరువాయి.

సంబంధిత సమాచారం :

More