రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ !
Published on Jul 7, 2017 10:28 am IST


రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి ఘన విజయం తర్వాత రానా చేసిన మొదటి సినిమా కావడంతో అందరూ ఈ చిత్రం కొమ్మా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా యొక్క విడుదల తేదీని నిర్ణయించారు నిర్మాతలు.

ఆగష్టు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒక సాధారణ యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా రానా కెరీర్లో ఒక ముఖ్యమైన సినిమాగా నిలిచిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా సురేష్ బాబు, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook