నైజాంలో “ఆచార్య” రెండో రోజు వసూళ్ల వివరాలు.!

Published on May 1, 2022 2:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య” రీసెంట్ గానే విడుదల అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. వేసవి కానుకగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లనే అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రెండో రోజు నైజాం లో వసూళ్ల డీటెయిల్స్ ఇప్పుడు బయటకి వచ్చాయి. మరి ఈ చిత్రానికి ఇక్కడ రెండో రోజుకి గాను 2.25 కోట్ల షేర్ వసూలు అయ్యిందట.

దీనితో రెండు రోజులకి గాను ఈ చిత్రం 10 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. ఇక ఈ ఆదివారం కూడా ఈ తరహా నెంబర్ ని ఆశించవచ్చు. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించగా పూజా హెగ్డే చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం :