“దేవర” ఓటిటి పార్ట్నర్ లాక్.!

“దేవర” ఓటిటి పార్ట్నర్ లాక్.!

Published on Dec 26, 2023 4:17 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ఈ చిత్రంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వైరల్ గా మారాయి. వీటితో పాటుగా మరో సాలిడ్ అప్డేట్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది.

దేవర ఓటిటి డీల్ ఓ ప్రముఖ సంస్థకి లాక్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో చెల్లించి దిగ్గజ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని కొరటాల పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు