ఆ యువ దర్శకుడితో విజయ్ దేవరకొండ చిత్రం !
Published on Oct 24, 2017 5:12 pm IST

ఒక హీరో స్టార్ అయిపోవడానికి ఒక్క పెద్ద హిట్ చాలు. అలా ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన విజయ్‌ దేవరకొండ, ఆ సినిమా తరువాత వెనక్కు తిరిగి చుస్కోవల్సిన పని లేకుండా పోయింది ఈ హీరోకి. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో చేసే సినిమా సెట్స్ పై ఉండగానే, మిగతా సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది.

‘ఓనమాలు’, ‘మళ్ళిమళ్ళి ఇది రాని రోజు’ వంటి మంచి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతిమాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. క్యూట్ లవ్ స్టోరీతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంభందించి నటినటుల ఎంపిక జరుగుతుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యనున్నారు నిర్మాత కే.ఎస్.రామారావ్.

 
Like us on Facebook