ఓటిటిలో హవా కొనసాగిస్తున్న చై “దూత”.!

ఓటిటిలో హవా కొనసాగిస్తున్న చై “దూత”.!

Published on Dec 15, 2023 3:00 PM IST

అక్కినేని యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య నటించిన తన మొట్ట మొదటి ఓటిటి సిరీస్ “దూత” కోసం ఇప్పుడు ఓటిటి లవర్స్ కి కానీ తెలుగు ఆడియెన్స్ కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ తో చేసిన ఈ హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ తో చైతు ఈ ఏడాది సాలిడ్ హిట్ ని అయితే ఫ్యాన్స్ కి అందించాడు. మరి రిలీజ్ అయ్యిన రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ కి భారీ రెస్పాన్స్ అందుకుంది.

దీనితో మొదటి వారం కూడా ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్ లో ఈ సిరీస్ ట్రెండింగ్ లో నిలవగా మరి రెండో వారంలో కూడా ఈ సిరీస్ నెంబర్ 1 స్థానంలోనే ట్రెండ్ లో కంటిన్యూ అవుతూ హవా కొనసాగిస్తుంది. మొత్తానికి అయితే చైతూ ఓటిటిలో ఒక మాసివ్ డెబ్యూ అందుకున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ సిరీస్ లో ప్రియా భవాని శంకర్, ప్రాచి దేశాయ్ అలాగే పశుపతి, గౌతమ్, తరుణ్ భాస్కర్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు