RC15 టీమ్ ఆ రోజున ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందిస్తుందా ?

RC15 టీమ్ ఆ రోజున ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందిస్తుందా ?

Published on Dec 27, 2022 8:11 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ తో కూడిన పొలిటికల్ అంశాలు గల ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుండి న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని అనౌన్స్ చేయనున్నారు అనే వార్తలు రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కాగా దీని పై మూవీ యూనిట్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావలసి ఉండగా పలువురు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరోజున ఫస్ట్ లుక్ కోసం మాత్రం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి RC15 టీమ్ ఆ రోజున ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందిస్తుందో లేదో తెలియాలి అంటే యూనిట్ నుండి ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు