పీరియాడిక్ చిత్రంలో వైవిధ్యమైన కథానాయకుడు !
Published on Jun 24, 2018 3:13 pm IST


ఎప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలని కోరుకున్నే ‘నారా రోహిత్’, ప్రస్తుతం అలాంటి చిత్రానికే శ్రీకారం చుట్టబోతున్నారు. 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో ‘నారా రోహిత్ నటించనున్నారు. దర్శకుడు చెైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. నారా రోహిత్ తన కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని అందుకే తానే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని అంతే స్థాయిలో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు కూడా ప్యాడింగే ఉండే అవకాశం ఉంది. ఎలాగైనా ఈ సినిమా పై క్రేజ్ తీసుకురావాలని నారా రోహిత్ ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ చిత్రానికి డిజైన్ చేయనున్నారు. అయితే ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook