“రావణాసుర” డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీటైల్స్ ఇవే!

“రావణాసుర” డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీటైల్స్ ఇవే!

Published on Apr 7, 2023 8:17 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. ఈ చిత్రం ఈ రోజు థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్, అను లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం లో సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం కి సంబంధించిన డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ పై క్లారిటీ వచ్చింది.

ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేయగా, జీ తెలుగు శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందించిన ఈ చిత్రం ను అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు