కమల్ హాసన్ సినిమాని నిర్మించనున్న దిల్ రాజు ?


శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన ‘భారతీయుడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిన సంగతే. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ హిట్ చిత్రానికి ‘ఇండియన్-2’ పేరుతో సీక్వెల్ రూపొందనుంది. దీన్ని కూడా శంకరే డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయిందట.

ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న ‘రోబో-2’ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ అది పూర్తవగానే ‘ఇండియన్ 2’ పనుల్లోకి దిగుతారట. ఇక్కడ మరొక ఆసక్తికర అంశమేమిటంటే తెలుగులో ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సంచలనం రేపుతున్న ఈ ప్రాజెక్టుకు సంబందించిన మరిన్ని కొత్త వివరాల కోసం 123తెలుగు.కామ్ ను ఫాలో అవ్వండి.