క్లారిటి ఇచ్చిన టాప్ డైరెక్టర్ !
Published on Oct 27, 2017 12:30 pm IST

‘స్పైడర్’ సినిమా తరువాత మహేష్ బాబు నుండి వస్తున్న సినిమా ‘భరత్ అను నేను’ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా, దీని తరువాత మహేష్ వక్కంతం వంశి తో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాకు సంభందించి రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి, ఒకటి ‘కృష్ణా ముకుందా మురారి’ మరొకటి ‘హరేరామ హరే కృష్ణ’. తాజాగా చిత్ర దర్శకుడు వంశి పైడిపల్లి ఈ విషయంపై క్లారిటి ఇచ్చాడు.. ఇంకా సినిమాకు టైటిల్ నిర్ణయించలేదని తెలిపాడు. త్వరలో టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి, దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

 
Like us on Facebook