వరుస సినిమాలతో దూసుకెళ్తున్న దర్శకుడు కళ్యాణ్ జి గోగణ..!

Published on Feb 16, 2022 10:00 pm IST

ఒక సినిమాను ఎంత త్వరగా ఫినిష్ చేశారు.. ఎంత క్వాలిటీగా తీశారు అనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు సినిమాలను చాలా ఫాస్ట్‌గా తీసినా ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంకొందరు సినిమాలను స్లోగా తీసినా కొత్త కథలను ఎంచుకుంటూ మేకింగ్ పరంగా కొత్తదనాన్ని చూపిస్తుంటారు. అయితే సినిమాను అతి వేగంగా పూర్తి చేస్తూ, అందులో కొత్తదనాన్ని చూపించే దర్శకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కళ్యాణ్ జి గోగణ ముందుంటారు.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తెరకెక్కిన ‘నాటకం’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయిన కళ్యాణ్ జి గోగణకు ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ అదే బ్యానర్‌లో ‘సుందరి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన కాదల్, తీస్ మార్ ఖాన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అలా నిర్మాతలకు సపోర్టివ్‌గా సినిమాలను వేగంగా తెరకెక్కిస్తూ మంచి దర్శకుడిగా నిరూపించుకున్నారు కళ్యాణ్ జి గోగణ. ఆయన ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న ‘తీస్ మార్ ఖాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ పుట్, దర్శకుడి పనితనం నచ్చిన నిర్మాత తిరుపతి రెడ్డి, హీరో ఆది మరొక సినిమాను కళ్యాణ్ జీ గోగణతో చేయబోతోన్నారు. ‘తీస్ మార్ ఖాన్’ సినిమా ఇంకా పూర్తి కాకముందే మరో చిత్రాన్ని కూడా ఓకే చేశారు. అలా నిర్మాత, హీరోలను మెప్పిస్తూ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజన్ ఉన్న దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ దూసుకుపోతోన్నారు.

సంబంధిత సమాచారం :