బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్

Published on Apr 19, 2022 5:00 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో సినిమా అయిన హను మాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తేజ సజ్జ టైటిల్ రోల్ పోషిస్తుండగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రశాంత్ వర్మ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే సంగతి తెలిసిందే.

క్రీడపై ఉన్న ఆసక్తి ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో రెండు పతకాలు సాధించేలా చేసింది. పోటీలో కాంస్య, రజత పతకాలను గెలుచుకున్నాడు. వాటిని సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల తో పంచుకున్నాడు. దర్శకుడు తన అనుచరుల నుండి మరియు ఇతరుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. వర్క్ ఫ్రంట్‌లో, దర్శకుడు తాజాగా అధిర అనే మరో క్రేజీ సూపర్ హీరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ ఈ యాక్షన్ మూవీలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. ఇది హను మాన్ విడుదల తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం :