సీఎం కేసీఆర్, మంత్రి తలసానికి థ్యాంక్స్ చెప్పిన రాజమౌళీ..!

Published on May 22, 2020 10:29 pm IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించేందుకు నేడు సినీ ప్రముఖులంతా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. సినిమా షూటింగులకు, సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

అయితే దీనిపై సానుకోలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతానికి తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ-ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే సినీ రంగం ఎదురుకుంటున్న కష్టాలను తెలుసుకుని దీనిపై త్వరలో ఒక తీర్మానాన్ని తీసుకువస్తానని తెలిపి ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళిన మంత్రి తలసాని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా బాధలు విని సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఅర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశాడు.

సంబంధిత సమాచారం :

X
More