ఇంటర్వ్యూ : డైరెక్టర్ శంకర్ – ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం.

ఇంటర్వ్యూ : డైరెక్టర్ శంకర్ – ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం.

Published on Nov 27, 2018 3:30 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న ‘2.ఓ’ చిత్రం నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి సన్నధంగా ఉంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

మీ సినిమాల్లో ఆల్ ఎమోషన్స్ తో పాటు గొప్ప మెసేజ్ కూడా ఉంటుంది. మరీ ఈ సినిమాలో అలాంటి మెసేజ్ మేం ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చా ?

ఈ సినిమాని 4డీ సౌండ్స్‌ తో త్రీడిలో తెరకెక్కించాం. సినిమాలోని విజువల్స్ ఖచ్చితంగా మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అలాగే ఈ సినిమాలో గొప్ప గ్లోబల్ మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ తో పాటు ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఉన్నాయి. సినిమా మీరు ఏ విషయంలోనూ డిజ్పాయింట్ అవ్వరు.

ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ త్రీడి. మొదటిసారిగా మీరు త్రీడీలో షూట్ చేశారు. షూట్ చేస్తోన్న సమయంలో మీరు పేస్ చేసిన ఇబ్బందులు ఏమిటి ?

త్రీడీలో షూట్ చెయ్యటానికి మాకు కేవలం నాలుగు లెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆ నాలుగు లెన్సెస్ తోనే సినిమాని మొత్తం చెయ్యాల్సి వచ్చింది. మాములుగా షూట్ చేస్తే.. వన్ మినిట్ లో అయిపోయే షాట్ కూడా వన్ అవర్ దాకా టైం పట్టేది. అలా ఒక్కో షాట్ కి చాలా టైం పెట్టాల్సి వచ్చింది. త్రీడీలో షూట్ చెయ్యాలంటే చాలా పేసెన్సీ ఉండాలి.

మీ సినిమాల్లో టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటారు. అసలు మీరు టెక్నాలజీలో ఇంతగా అప్ డేట్ ఎలా అవ్వగలుగుతున్నారు ?

టెక్నాలజీ మీద నేనెప్పుడూ అప్ డేట్ అవ్వాలనుకొను. నేను రాసుకున్న కథకు ఎలాంటి టెక్నాలజీ అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. అలా నేను సినిమా సినిమాకి ఏదొక టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను.

‘రోబో’ సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంది. అలాగే హీరో హీరోయిన్లు మధ్య రొమాన్స్ కూడా చాలా బాగుంటుంది. మరీ ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ మరియు రొమాన్స్ ఎంతవరకు ఉంటుంది ?

నేను గతంలోనే చాలా సార్లు చెప్పాను. ఇది రోబో సినిమాని తియ్యట్లేదు. ఆ సినిమాకి ఏది అవసరమో అది ఆ సినిమాకి చేశాను. ఇప్పుడు ఈ సినిమాకి ఏది అవసరమో అదే చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. కానీ కొంతవరకు రొమాన్స్ కూడా ఉంటుంది. అన్నిటికీ మించి చాలా న్యూ థింగ్స్ ఈ సినిమాలో ఉంటాయి.

అక్షయ్ కుమార్ హిందీలో పెద్ద స్టార్ హీరో. మరీ అలాంటి స్టార్ఈ హీరోని ఈ సినిమాలో విలన్ గా ఎందుకు పెట్టాలనుకున్నారు ?

అక్షయ్ కుమార్ గారి ఈ సినిమాలో జస్ట్ విలన్ కాదు అండి. ఆయన క్యారెక్టర్ లో చాలా షేడ్స్, వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ వల్లే అక్షయ్ గారు ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో అక్షయ్ గారి పాత్ర చాలా హైలెట్ గా నిలుస్తోంది.

అక్షయ్ కుమార్ గారితో మీరు మొదటిసారి వర్క్ చేశారు. ఆయనకి యాక్షన్ కట్ చెప్పటం ఎలా అనిపించింది. అలాగే ఆయన గురించి చెప్పండి ?

అక్షయ్ కుమార్ గారు చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఈ సినిమాలో ఆయన చేసిన రోల్ లో ఆయన్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేము. ఇక ఆయనతో పని చెయ్యడం వల్ల నా పని చాలా తేలిక అయింది. ఈ సినిమా ఇంత బాగా రావటానికి ఆయన పాత్ర కూడా చాలా కీలమైనది.

ఈ సినిమా క్లైమాక్స్ చేస్తోన్న సమయంలో రజినీకాంత్ గారికి హెల్త్ ప్రొబ్లెమ్స్ వచ్చినా ఆయన షూట్ లో పాల్గొన్నారట ?

అవును. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తోన్న టైంలో రజినీకాంత్ గారికి హెల్త్ ప్రొబ్లెమ్స్ వచ్చాయి,. ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ షూటింగ్ ఆగిపోతే నిర్మాతకి భారీ నష్టం అని అలాంటి సిచ్యుయేషన్ లో కూడా ఆయన వచ్చి షూట్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ ని పూర్తి చేశారు. ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు