టీటీడీ కి చెందిన ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్స్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ స్వప్నను మరియు నాగార్జున హీరోగా ఢమరుకం చిత్రం తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస రెడ్డి లను నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 22వ తేదీ నుండి ఆయన విధులు నిర్వహించనున్నారు. హిందూ మత ప్రచారానికి ఉద్దేశించిన ఈ ఛానల్ కి చైర్మన్ గా మరో హాస్యనటులు పృథ్వి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.


