పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్కెట్ మహాలక్ష్మి” ఉంటుంది – దర్శకుడు విఎస్ ముఖేష్

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్కెట్ మహాలక్ష్మి” ఉంటుంది – దర్శకుడు విఎస్ ముఖేష్

Published on Apr 16, 2024 9:18 AM IST


బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో దర్శకుడు వియస్ ముఖేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.

నా పేరు విఎస్ ముఖేష్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ‌లో దాదాపు 100 కి పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలా ఒకరోజు అఖిలేష్‌ గారిని కలవడం, మార్కెట్ మహాలక్ష్మి స్క్రిప్ట్‌ను నరేట్ చేయడం జరిగింది. మేము నిజాయితీగా, ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేసాము. ఆ మేజర్ పాయింట్ ని ప్రమోషన్ల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. మార్కెట్ మహాలక్ష్మి పూర్తి లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అది బేస్ చేసుకొని సినిమా కథ గా రాయడం జరిగింది.

నా నమ్మకం నటీనటులపై కాదు, నా స్క్రిప్ట్‌పై, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను. పార్వతీశం మరియు ప్రణీకా అన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పార్వతీశంకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నాను. మాకు చాలా OTT ఆఫర్‌లు వచ్చాయి, కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారనే భావంతో రిస్క్ తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు