ఆహా లో “డీజే టిల్లు” సెన్సేషన్!

ఆహా లో “డీజే టిల్లు” సెన్సేషన్!

Published on Jan 19, 2024 3:50 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం లో 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది. ఇది రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ అని చెప్పాలి.

సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించడం జరిగింది. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందించగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం కి సీక్వెల్ టిల్లు స్క్వేర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు