విడుదలకు సిద్దమైన ‘దువ్వాడ జగన్నాథం’ మొదటి పాట !

21st, May 2017 - 07:48:32 PM


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇకపోతే ఫ్యాన్స్ కు టీజర్, ట్రైలర్ తర్వాత సినిమా నుండి ఎలాంటి సప్రైజ్ రాలేదు. దీంతో అభిమానుల్లో కాస్తంత నిరుత్సాహం తలెత్తింది.

దాన్ని మాయం చేసి వాళ్లలో హుషారు పుట్టించడానికే అన్నట్టు ఆడియోలోని ‘డీజే శరణం భజే భజే’ పాటను రేపు 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కొద్దిసేపటి క్రితమే ప్రకటించేశారు. ఇలా ఉన్నట్టుండి దువ్వాడ టీమ్ ఇచ్చిన షాక్ తో అభిమానులు సంబరపడిపోతూ పాట కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.