‘పేపర్ బాయ్’ టీజర్ ను ఎవరు విడుదల చేశారో తెలుసా !

Published on Jul 21, 2018 2:59 pm IST

‘రచ్చ’ ఫెమ్ సంపత్ నంది సొంత ప్రొడక్షన్స్ సంస్థ అయినా సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమాతో కలిసి సంపత్ నంది నిర్మిస్తున్న చిత్రం’ పేపర్ బాయ్’. నూతన దర్శకుడు జయశంకర్ తెరక్కిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను శనివారం ఉదయం నిజమైన పేపర్ బాయ్ గా పనిచేశే అఖిల్ చేత విడుదల చేయించారు. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

నిర్మాతగా సంపత్ నందికి ఇది రెండో చిత్రం ఇంతకుముందు ఆయన నిర్మించిన ‘గాలిపటం’ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. మరి ఆగష్టు లో ప్రేక్షకులముందుకు రానున్న ఈచిత్రం తోనైనా ఆయన విజయం సాధిస్తారో లేదో చూడాలి.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :