బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా నటించిన క్రేజీ థ్రిల్లర్ సీక్వెల్ సినిమానే ‘దృశ్యం 3’. ఒరిజినల్ మలయాళం కి పూర్తి భిన్నంగా పార్ట్ 3 ని వీరు తీసి ముగించేశారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ మొదటి రోజు ట్రేడ్ వర్గాల్లో షాకింగ్ గా నిలిచాయి. ఇలా సంచలన ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియా వైడ్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది.
లేటెస్ట్ గా సినిమా వసూళ్లు 200 కోట్ల నెట్ మార్క్ కి చేరుకున్నాయి. దృశ్యం 3 నిన్న సోమవారం 21 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకుంది. దీనితో ఈ నాలుగు రోజుల్లో 195 కోట్ల మార్క్ అందుకుంది. దీనితో వీక్ డేస్ లో కూడా సినిమా ర్యాంపేజ్ చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఫైనల్ రన్ లో మరిన్ని భారీ రికార్డులు ఈ సినిమా సెట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా శ్రీయ శరన్, టబు తదితరులు నటించారు.


