తండ్రీకొడుకులుగా అలీ, మౌళి: ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఖరారు చేసిన మైత్రీ మూవీ మేకర్స్

తండ్రీకొడుకులుగా అలీ, మౌళి: ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఖరారు చేసిన మైత్రీ మూవీ మేకర్స్

Published on Oct 6, 2026 7:00 PM IST

‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో మెప్పించిన యూట్యూబర్, నటుడు మౌళి తనుజ్ ప్రశాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్‌తో వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్‌లోనే తీసుకురావాలని భావించినప్పటికీ, వాయిదా పడింది. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ద్వారా ‘దొంగ నా కొడుకు’ చిత్రాన్ని నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగే రాబరీ నేపథ్యంలో ఉండనున్నట్లు అర్థమవుతోంది.

ఈ చిత్రంలో మౌళికి తండ్రిగా సీనియర్ నటుడు అలీ నటిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీను కంబాల కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సుస్మితా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, సింజిత్ యెర్రమిల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు