టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కింగ్ ఆఫ్ కామెడీ శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా సినిమానే ‘కామ్రేడ్ కళ్యాణ్’. దర్శకుడు జానకిరామ్ మారేళ్ల తెరకెక్కించిన ఈ సినిమా ఆదర్శ కుటుంబం వదులుకున్న డేట్ లో ఎంటర్టైన్ చేసేందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తాలూకా ట్రైలర్ కట్ ని మేకర్స్ ఇప్పుడు విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉందని చెప్పవచ్చు.
బాలయ్య వీరాభిమాని పాత్రలో నటి రాధికా పై సాలిడ్ ఫన్ ట్రాక్ తో మొదలైన ఈ ట్రైలర్ అక్కడ నుంచి శ్రీవిష్ణు తన మార్కు కామెడీ టైమింగ్ తో ముందుకు తీసుకెళ్లాడు. అలాగే కమెడియన్స్ పై ఫన్ సీన్స్ హీరోయిన్ మహిమా నంబియార్ పై సీన్స్ కూడా మంచి ఎంగేజింగ్ గా సాగాయి. అయితే ఈ కామెడీ తో పాటుగా సినిమా టైటిల్ కి తగ్గట్టుగా శ్రీవిష్ణుపై నక్సలైట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకింత థ్రిల్లింగ్ గా ఉండేలా కనిపిస్తుంది.
అతను ఎందుకు అలా కూడా ఉన్నాడు. ఇందులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంకా అనిమల్ నటుడు ఉపేందర్ లిమాయే, ఇంకా బుల్లిరాజు వంటి నటీనటులతో ప్యాకెడ్ గా కనిపిస్తుంది. సో ఓ పక్క కామెడీ ఇంకోపక్క థ్రిల్ మూమెంట్స్ తో కూడా ఆకట్టుకునేలా ఇది కనిపిస్తుంది. అలాగే విజయ్ బుల్గానిన్ ఇచ్చిన స్కోర్, పాటలు కూడా ఇందులో బాగున్నాయి. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ ఎల్ పి అలాగే కోనా ఫిల్మ్ కార్పోరేషన్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


