అందరి దృష్టీ ‘జై’ పాత్రపైనే !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చిత్రంలోని జై పాత్ర కోసం అంతకన్నా ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. సాదా సీదా పాత్రలకే తన అభినయంతో కళ తీసుకొచ్చే తారక్ అన్ని విధాలా నటనకు ఆస్కారమున్న జై లాంటి బలమైన పాత్రలో ఎలాంటి నటన కనబరిచాడో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరిపోతున్నారు.

అంతేగాక నెగెటివ్ షేడ్స్, హీరోయిజం ఛాయలు ఎక్కువగా కనిపించే ఆ పాత్ర చుట్టూనే కథ నడుస్తుందని, ఆ పాత్రే సినిమాకు కీలకమని చిత్ర బృందం చెప్పడం, టీజర్, ట్రైలర్స్, ఆడియోలో కూడా దాన్నే ఎక్కువగా హైలెట్ చేయడం, జై పాత్రే ఇప్పటి వరకు తన కెరీర్లో కష్టతరమైన పాత్రని ఎన్టీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో దాని పట్ల ఆసక్తి ఇంకాస్త రెట్టింపైంది. ఈ ఆసక్తి కేవలం అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బలంగా ఉంది.

అందరి అంచనాలకు తగ్గట్టే పాత్ర స్థాయి గొప్పగా, కొత్తగా ఉండి, ఎన్టీఆర్ నటన కట్టిపడేసేలా ఉంటే ఈ పాత్ర ద్వారా సినిమా వసూళ్లు ఇంకాస్త ఊపందుకునే ఛాన్సుంది.