ప్రత్యేక చిట్ చాట్ : కృతిక జయకుమార్ – వెంకటేష్, మీనాలు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

ప్రత్యేక చిట్ చాట్ : కృతిక జయకుమార్ – వెంకటేష్, మీనాలు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

Published on Jun 19, 2014 1:47 PM IST

kruthika
విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దృశ్యం’. ఈ సినిమాలో వెంకటేష్ కి పెద్ద కుమార్తెగా బ్యూటిఫుల్ గర్ల్ కృతిక జయకుమార్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సందర్భంగా కృతికతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఈ పాత్ర చేసే అవకాశం ఎలా వచ్చింది?

స) నేను బెంగుళూరు లో నివసించే తమిళ అమ్మాయిని. ప్రస్తుతం ప్లస్ 2 చావుతున్నాను. అది కాకుండా నేనొక క్లాసికల్ డాన్సర్. భరతనాట్యం లో 11 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నా నేను ఇప్పటి వరకూ భారతదేశం మొత్తం చాలా షోస్ చేసాను. నేను ఓ సారి కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఓ షోలో పాల్గొన్నాను. అప్పుడు నన్ను గమనించిన ఓ మళయాళ డైరెక్టర్ నా ఫేస్ ఎక్స్ పెసివ్ గా ఉందని అన్నారు. ఆ తర్వాత నేను ‘దృశ్యం’ కాస్టింగ్ కాల్ కి నా ఫోటోలు పంపించాను. వాళ్ళు సెలక్ట్ చేసారు. నా తల్లి తండులు నన్ను బాగా సపోర్ట్ చేసారు, కానీ స్టడీస్ కి కూడా సమాన ప్రాధాన్యత ఇమ్మన్నారు. నేను ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయినప్పుడు భాష కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు 20% తెలుగు అర్థం అవుతుంది.

ప్రశ్న) మీరు దృశ్యం మూవీ చూసారా.? మొదటి సారి కెమెరా ముందు ఏమన్నా నెర్వస్ ఫీలయ్యారా?

స) మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని విన్నాను. అలాగే నేను చేసిన పాత్రకి పెర్ఫార్మన్స్ పరంగా చాలా ఆస్కారం ఉందని విన్నాను. కానీ సినిమా అయితే చూడలేదు. నేను ట్రైన్ అయిన నటిని కాదు, కానీ ఎన్నో డాన్సింగ్ షోస్ చేసాను కాబట్టి స్టేజ్ ఫియర్ అనేది లేదు. షూటింగ్ స్పాట్ లో మొదటి రెండు రోజులు మాత్రం చాలా మంది చాలా చెబుతూ ఉండడం వల్ల కాస్త నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఆ షూటింగ్ వాతావరణం, అక్కడ నేర్చుకున్న అనుభవం బాగా నచ్చింది.

ప్రశ్న) దృశ్యంలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) నా పాటలో నాకు నచ్చినది ఏమిటి అంటే ఇప్పడున్న టీనేజర్స్ తమ తల్లి తండ్రులతో అన్ని విషయాల్లోనూ బాగా ఓపెన్ గా ఉండరు. కానీ నా పాత్ర మాత్రం అన్ని ఓపెన్ గా చెప్పుకునేలా ఉంటుంది. అలాగే తన తండ్రి అంటే బాగా ఇష్టం, అలాగే అతని మీద డిపెండ్ అయ్యే పాత్ర. తన ప్రపంచం నాన్నే అనేలా నా పాత్ర ఉంటుంది. వెంకటేష్, మీన గార్లతో కలిసి పలు లోకేషన్స్ లో 35 నుంచి 40 రోజులు కలిసి పనిచేసాను. వాళ్ళిద్దరూ లేకపోతే నా పాత్రకి న్యాయం చేయలేకపోయేదాన్ని. వాళ్ళు నాకు సెట్లో ఎలా ఉండాలి, నటనలో కొన్ని టిప్స్, లుక్ పరంగా ఎలా నాచురల్ గా ఉండాలి ఇలా ఎన్నో విషయాలను నాకు చెప్పారు. అలాగే వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఫన్ కూడా చాలా ఎక్కువాగా ఉండేది. భవిష్యత్తులో కూడా గ్లామర్ మిక్స్ అయ్యి పెర్ఫార్మన్స్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మరో మంచి సినిమాని సెలక్ట్ చేసుకుంటాను. నాకు నా కాలేజ్ కూడా చాలా సపోర్ట్ ఇస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు