‘ఎఫ్ 2 , మిస్టర్ మజ్ను’ కృష్ణా షేర్ !

Published on Jan 27, 2019 2:00 pm IST

అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీ స్టారర్ ఎఫ్ 2 నిన్న కృష్ణా జిల్లాలో 19,97,495 లక్షల షేర్ ను రాబట్టింది. 15 రోజుల్లో ఈచిత్రం అక్కడ 4,47,92,470 షేర్ ను కలెక్ట్ చేసింది. ఈరోజుకూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.

ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన రొమాంటిక్ ఎంటర్టైనెర్ మిస్టర్ మజ్ను నిన్న కృష్ణా లో 19,97,495 లక్షల షేర్ ను రాబట్టి రెండు రోజులకుగాను అక్కడ 45,03,490 లక్షల షేర్ ను రాబట్టింది. అయితే ఈచిత్రానికి సోమవారం నుండి బాక్సాఫిస్ వద్ద అసలైన పరీక్ష ఎదురుకానుంది. అయితే ఎఫ్ 2 తప్ప వేరే చిత్రాల నుండి పోటీ లేకపోవడం ఈచిత్రానికి కలిసి వచ్చే అంశం.

సంబంధిత సమాచారం :