“లైగర్” ఫ్యాన్ ఎడిట్ ను షేర్ చేసిన విజయ్ దేవరకొండ!

Published on Sep 29, 2021 9:50 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఉపా శీర్షిక. ఈ చిత్రం ను ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర లో నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుపుకుంటుంది.

తాజాగా ఒక అభిమాని విజయ్ దేవరకొండ ఫోటోను ఎడిట్ చేయడం జరిగింది. అది కాస్త కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఆ ఫోటోను విజయ్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఎడిట్ సూపర్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక లైగర్ టీమ్ అందరి వద్ద ఈ ఫోటో ఉందని పేర్కొన్నారు. మీతో త్వరలో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫ్యాన్ ఎడిట్ చేసిన ఫోటో లో విజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :