ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్ !

22nd, August 2017 - 01:06:01 PM


మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం యొక్క టైటిల్, మోషన్ పోస్టర్ విడుదలైపోయాయి. ‘సైరా’ అనే టైటిల్ తో ‘నరసింహారెడ్డి’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న మోషన్ పోస్టర్ ను టీమ్ అద్భుతంగా డిజైన్ చేసింది. కుప్ప కూలుతున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గుర్తుచేస్తూ, రేనాటి సూర్యుడి పౌరుషాన్ని, వీరత్వాన్ని, అప్పటి కాలం ప్రజల్లోని తిరుగుబాటు తీవ్రతను కళ్ళకు కట్టే విధంగా ఉన్న మోషన్ పోస్టర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆతురతను రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే అభిమానులు, ప్రేక్షకులు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉంది మోషన్ పోస్టర్. అలాగే నిర్మాత రామ్ చరణ్ కూడా మేకింగ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని, విజువల్ వండర్ గా సినిమా ఉండేలా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే సినిమాను జాతీయ స్థాయిలో ఉండేలా అన్ని ముఖ్య పరిశ్రమల నుండి నటీనటుల్ని, టెక్నీషియన్లని ప్రాజెక్టులోకి తీసుకున్నారు.

మోషన్ పోస్టర్ కొరకు క్లిక్ చేయండి