నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా చేయనున్న తొలి సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళు నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ హీరోగా ఓ దర్శకుడుతో మొదటి సినిమా అనౌన్స్ అయినప్పటికీ తన మొదటి సినిమా మాత్రం మరో దర్శకుడు వశిష్ఠతో పట్టాలెక్కేలా ఉందని తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం వశిష్ఠతో క్రేజీ ప్రాజెక్ట్ మొదలు కావడానికి రంగం సిద్ధమవుతోంది అని తెలుస్తోంది.
ఇటీవల అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. సో బాలయ్య ఫ్యాన్స్ కి నందమూరి అభిమానులుకి చిరకాల కోరిక నెరవేరబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే దర్శకుడు ప్రశాంత్ వర్మతో అనౌన్స్ చేసిన సూపర్ హీరో ప్రాజెక్ట్ ఏమైందో తెలియాల్సి ఉంది. ఇక మోక్షజ్ఞ, వశిష్ఠల ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


