టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమానే ఆదర్శ కుటుంబం. ఇంకా సినిమా షూట్ బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ సినిమా విడుదల వాయిదా వేశారు. ఇక కొత్త డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు కానీ లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ దీన్ని లీక్ చేయడం వైరల్ అయ్యింది.
ఈ సినిమాని అక్టోబర్ 30న విడుదల చేస్తున్నట్టు ఓ పోస్ట్ వేసి లీక్ చేసాడు. కానీ ఆ పోస్ట్ వెంటనే తీసేసి మళ్లీ డేట్ లేకుండా పదో నెల ఒక్కటి మాత్రం పెట్టి మళ్లీ వేసాడు. దీనితో ఆదర్శ కుటుంబం విడుదల తేది దాదాపు ఈ నెల 30 అనే అనుకోవచ్చు. సో మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


