ఇపుడు టాలీవుడ్ ఆడియెన్స్ లో ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సినిమాల్లో వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా ఆదర్శ కుటుంబం కూడా ఒకటి. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఊహించని రీతిలో కొంచెం ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమాకి మొదట ఓ సంగీత దర్శకుడు అనౌన్స్ అయితే తర్వాత తన నుంచి థమన్ కి సినిమా వెళ్ళింది.
ఇక ఇదిలా ఉండగా సంగీతం పరంగా మరో కొత్త ఎడిషన్ యాడ్ అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఇప్పుడు ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హారిక హాసిని వారు నిర్మాణం వహించగా అతి త్వరలోనే సినిమా విడుదల తేది ప్రకటించనున్నారు.


