ఆ వైలెంట్ సీన్ వివాదానికి తెర: రజనీకాంత్ ‘జైలర్ 2’ సెన్సార్ సర్టిఫికెట్, రన్‌టైమ్ వివరాలివే! I

ఆ వైలెంట్ సీన్ వివాదానికి తెర: రజనీకాంత్ ‘జైలర్ 2’ సెన్సార్ సర్టిఫికెట్, రన్‌టైమ్ వివరాలివే! I

Published on Oct 6, 2026 10:06 PM IST

సూపర్‌ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యూ/ఏ 16+’ సర్టిఫికెట్ మంజూరు చేయడంతో పాటు సినిమా అధికారిక నిడివి కూడా ఖరారైంది.

కొద్దిరోజుల క్రితం చిత్రంలోని ఒక వైలెంట్ సీన్ విషయంలో రజనీకాంత్ కి దర్శకుడు నెల్సన్ అండ్ టీం నడుమ కొంచెం డిస్కషన్ జరిగింది. సినిమాకు యూ/ఏ కావాలని తలైవర్, కాదు ఏ సర్టిఫికెట్ కావాలని నెల్సన్ పట్టుబడితే ఫైనల్ గా ఈ వార్ లో రజినినే గెలిచినట్టు ఇప్పుడు ఖరారు అయ్యింది.

165 నిమిషాల రన్‌టైమ్.. భారీ తారాగణం

ఈ చిత్ర అధికారిక రన్‌ టైమ్ 165 నిమిషాలు, అంటే సరిగ్గా 2 గంటల 45 నిమిషాలుగా లాక్ అయింది. గత సినిమా లానే ఇందులో కూడా ప్రధాన నటీనటులు లిస్ట్ పెద్దదే. సో రజినీకాంత్ తో పాటు అందరినీ కవర్ చేయాలి అంటే ఆ మాత్రం ఉండాల్సిదే. సో ఈ స్టార్ కాస్ట్ తో ఈ నిడివిలో నెల్సన్ ఎలా ప్లాన్ చేశారో చూడాలి.

ఈ చిత్రంలో విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు, మిర్నా, రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు మోహన్‌లాల్, హృతిక్ రోషన్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి ప్రత్యేక అతిథి పాత్రల్లో మెరవనుండటం ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు