సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే జైలర్ 2. టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో చేసిన ఈ మ్యాడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల ఇప్పుడు దగ్గరకి వస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్న ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సాలిడ్ బిజినెస్ జరుపుకుంటు వచ్చింది. ఇలా హిందీలో ఈ సినిమా బిజినెస్ కోసం ఇప్పుడు తెలుస్తోంది.
హిందీలో ఈ సినిమా 33 కోట్ల గ్రాస్ టార్గెట్ తో దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి అక్కడ 16 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్. సో జైలర్ 2 తో తలైవర్ ఈ మొత్తం రాబట్టాల్సి ఉంది. రజినీకాంత్ కి ఒకప్పుడు హిందిలో మార్కెట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది కానీ ఇప్పుడు తగ్గింది. సో ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


