మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు కాకా లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత లైనప్ లో మరింతమంది యువ దర్శకులు ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే వీరిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ పై మాత్రం ఆ అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది అనేది ఆసక్తిగా మారింది.
కానీ దీనిపై నిర్మాత నాని లేటెస్ట్ కలర్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పట్లో మొదలు కాదని అందుకు చాలా సమయం పడుతుంది అని క్లారిటీ ఇచ్చేసాడు. సో ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్న ఈ బిగ్ కాంబినేషన్ టేకాఫ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ గ్యాప్ లో చిరు మరో సినిమా కూడా చేసేస్తారేమో చూడాలి.


