ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా కామన్ గా మారుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఒకో స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంటూ తమ ప్రెజెన్స్ పాన్ ఇండియా లెవెల్లో విస్తరిస్తున్నారు. ఇలా లేటెస్ట్ గా జైలర్ 2 కోసమే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ 2 లో అందరి కామియో లతో పాటుగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కామియో కూడా కన్ఫర్మ్ అయ్యింది.
అయితే రజినీకాంత్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ కి తలైవర్ గత సినిమా కూలీ లో ఓ బాలీవుడ్ బిగ్ స్టార్ కామియో మిగిల్చిన గాయం ఎఫెక్ట్ ఇప్పటికీ కనిపిస్తుంది. కూలి సినిమాలో అమీర్ ఖాన్ దహా గా ఇచ్చిన కామియో అంత ఇంపాక్ట్ చూపించకపోగా ట్రోల్స్ పడ్డాయి. ఇప్పుడు మళ్లీ హృతిక్ కామియోని కూడా ఇలానే చేస్తారా ఏమో అని మూవీ లవర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. అయితే నెల్సన్ మాత్రం అలాంటి మిస్టేక్ చేయడు అనే అనుకోవచ్చు. సో జైలర్ 2 లో హృతిక్ ట్రీట్ ఎలా వుంటుందో చూడాలి.


