ఇక మహేష్ ఒక్కడు బాకీ ఉన్నాడు..!

Published on Nov 13, 2021 7:03 am IST

ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రకంగా బిగ్ మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతుంది అని చెప్పాలి. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలు నుంచి అందులోని రిలీజ్ ఆల్రెడీ రెడీగా ఉన్న వాటి నుంచి అన్నీ సూపర్ హిట్స్ సాంగ్సే వచ్చి వైరల్ అవుతున్నాయి. ‘RRR, అఖండ, భీమ్లా నాయక్’ ఇలా ఆల్ మోస్ట్ అన్ని సినిమాల నుంచి కూడా ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్స్ కూడా వచ్చి హిట్ అవుతున్నాయి.

దీనితో ఇక ప్రభాస్ రాధే శ్యామ్, సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నుంచి మాత్రమే బాకీ ఉన్నాయి అనుకుంటే నిన్ననే రాధే శ్యామ్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. ఇక ఇదిలా వుండగా ఫైనల్ గా మహేష్ మాత్రం బ్యాలన్స్ ఉన్నాడని చెప్పాలి.

తన సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థమన్ మహేష్ నుంచి వస్తున్న మరో ఆల్బమ్ కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ సర్కారు వారి ‘పాట’ ఎప్పుడు నుంచి మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More