‘బాహుబలి’ నుండి పూర్తిగా బయటపడ్డ రాజమౌళి !


దర్శకుడు రాజమౌళి ఇప్పటి వరకు ఏ తెలుగు దర్శకుడు చేయనటువంటి సాహసం చేశారు. దాదాపు 5 ఏళ్ల తన దర్శకత్వ జీవితాన్ని బాహుబలి సిరీస్ కోసం ఖర్చు చేశారు. అందుకు ఆయనకు గొప్ప ఫలితమే దక్కినప్పటికీ ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన అహర్నిశలూ కష్టపడ్డారు. ప్రాంచైజీలో చివరి భాగమైన ‘బాహుబలి-ది కంక్లూజన్’ రిలీజైనప్పటికే ఆయన విశ్రాంతి తీసుకోకుండా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ దేశాల్లో పర్యటించారు.

అలా సినిమా కోసం అన్ని వైపుల నుండి కష్టపడ్డ రాజమౌళికి ఎట్టకేలకు పూర్తి స్థాయి విముక్తి లభించింది. సినిమా ప్రమోషన్ల కోసం కొన్ని రోజుల క్రితం జక్కన్న టీమ్ మొత్తం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్ది గంటల క్రితమే ఆ ప్రచార కార్యక్రమాలు ముగిశాయి. దీంతో బాహుబలికి సంబందించిన అన్ని పనులు ముగిసినట్లయింది. ఈ విషయాన్నే రాజమౌళి తెలుపుతూ ‘లండన్ ప్రమోషన్స్ ముగిశాయి. దీంతో బాహుబలికి సంబందించిన నా పనులన్నీ పూర్తైపోయాయి’ అంటూ ట్వీట్ చేశారు.