ఫైనల్ గా మాస్ మహారాజ్ “ఖిలాడి” రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Nov 11, 2021 10:58 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ఖిలాడి”. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రవితేజ మాస్ కం బ్యాక్ “క్రాక్” తర్వాత స్టార్ట్ చేసిన సినిమా కావడం పైగా దీనిని భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చెయ్యడంతో దీనిపై భారీ లెవెల్ అంచనాలు రవితేజ అభిమానులు ఏర్పరచుకున్నారు.

అయితే కరోనా రెండో వేవ్ మూలాన సినిమా రిలీజ్ వాయిదా పడి తర్వాత రిలీజ్ కి టైం తీసుకుంది. కానీ ఈరోజు ఎట్టకేలకు ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ రివీల్ చేసేసారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ భారీ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చెయ్యగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More