టాక్..చరణ్, శంకర్ ల మాసివ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్.?

Published on Jan 27, 2022 10:00 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ కూడా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ లో ఒక బెస్ట్ లైనప్ అని చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి తో భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కంప్లీట్ చేసాడు అది రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా దర్శకుడు అయిన శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి సెన్సేషన్ నే నమోదు చేసాడు.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా అనౌన్స్ చేయడంతోనే భారీ హైప్ ని సెట్ చెయ్యగా ఇది స్టార్ట్ అయ్యాక కాన్సెప్ట్ పోస్టర్ చూసాక మరింత ఆసక్తి ఈ చిత్రంపై నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

వచ్చే మార్చ్ 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని ప్రెజెంట్ టాక్. అయితే ఇందుకు అవకాశం కూడా చాలానే ఉందని చెప్పాలి. మరి చరణ్, శంకర్ ల కెరీర్ లో మాసివ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ నుంచి 50 వ సినిమాగా నిర్మాణం వహిస్తుండగా కియారా అద్వానీ ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :