‘గేమ్ ఛేంజర్’ : ‘జరగండి’ సాంగ్ కి దిల్ రాజు స్టెప్పులు

‘గేమ్ ఛేంజర్’ : ‘జరగండి’ సాంగ్ కి దిల్ రాజు స్టెప్పులు

Published on Mar 27, 2024 11:46 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా జరగండి అనే పల్లవితో సాంగ్ ని రిలీజ్ చేసారు.

ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో అందరి నుండి మంచి ఆదరణ అందుకుంటోంది. విషయం ఏంటంటే, నేడు హైదరాబాద్ లో జరుగుతున్న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గేమ్ ఛేంజర్ లోని జరగండి సాంగ్ కి తన స్టైల్ లో సరదాగా స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన డ్యాన్స్ చేస్తున్న సమయంలో పలువురు చరణ్ ఫ్యాన్స్ ఈలలు, గోలలతో హోరెత్తించారు. కాగా ఈ వేడుకలకు హాజరైన హీరో నిఖిల్, దర్శకుడు బాబీ, నటుడు కిరణ్ అబ్బవరం, దర్శకుడు బుచ్చిబాబు సన, నిర్మాత రవిశంకర్ సహా మరికొందరు చరణ్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు